RRR News
On 10th Sep, 2019 సినీ ప్రముఖులు మరియు అభిమానులు కొరకు సరైన వినోదాన్ని పంచడం కోసం డైరెక్టర్ రాజమౌళి RRR సినిమా బాహుబలి కంటే భారీ చిత్రంగా చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఈ కాలంలో అత్యంత పాపులర్ అయిన రాంచరణ్ మరియు తారక్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఏమి ఉండబోతుందో చెప్పడానికి చూచాయగా ఒక చిత్రాన్ని ఇక్కడ ఇస్తున్నాము.
ఈ చిత్రంలో తారక్ ఆదివాసి రైతు పుత్రుడైన కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. ఇది ఒక రైతు బిడ్డ పాత్ర అయినందున సినిమాలో చాలా భాగం షూటింగ్ ఫారెస్ట్ ఏరియా లో జరగనున్నది. ఆర్ ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్ బల్గేరియాలో జరుగుతోంది, దీనిలో భాగంగా ఎన్టీఆర్ డమ్మీ పులి వేషం లో ఉన్న మనుషుల తో ఫైట్ చేస్తారు. తరువాత ఈ పులితో ఫైటింగ్ అనేది సహజంగా ఉండేటట్లుగా అత్యంత జాగ్రత్తలతో నిజమైన పులిని క్రియేట్ చేసి ఫైట్ సీక్వెన్స్ ని ఎడిట్ చేస్తారు.
రానా మరియు ఒక బుల్ మధ్య ఇలాంటి ఫైట్ సీక్వెన్స్ ని రాజమౌళి బాహుబలి చిత్రంలో చేశారు కానీ బాహుబలి చిత్రంలోని గ్రాఫిక్స్ సన్నివేశాలు సహజంగా అనిపించలేదు. హాలీవుడ్ సినిమా లైన 10000 BC మరియు 300 మనం పరిశీలించినట్లయితే అందులో జంతువులతో కూడిన సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. కాబట్టి రాజమౌళి ఈ సినిమా కోసం సన్నివేశాలు సహజంగా ఉండేట్లుగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దీనిలో భాగంగా రాజమౌళి గ్రాఫిక్స్ లో ఎంతో ప్రావీణ్యం ఉన్నా అంతర్జాతీయ ఆర్టిస్టులతో పని చేస్తున్నారు.
RRR మరియు ఇతర తెలుగు సినిమా వార్తలు కోసం మా వెబ్ సైట్ ని రెగ్యులర్ గా విజిట్ చేయండి.